Jun 17,2022 22:46

జానపద వృత్తి కళాకారుల నూతన కమిటీ ఎన్నిక
ప్రజాశక్తి-పలమనేరు:
జానపదవృత్తి కళాకారుల సంఘం చిత్తూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం స్థానిక పిజెసి కళ్యాణ మండపంలో చిరంజీవి అధ్యక్షతన జరిగింది. ఈసమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు మురళి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. తిరుమల కొండపై భజనలను ప్రారంభిస్తామని టిటిడి ఈవో ధర్మారెడ్డి తమ సమక్షంలో ప్రకటించడం ఆనందదాయకమని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. భజనల పేరుతో ఎవరికీ వందలు,వేలు కట్టాల్సిన పనిలేదని, కళాకారులు దళారుల మాటలు నమ్మవద్దని నేరుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. కళాకారులు, వాయిద్య పరికాలు టిటిడి అనుబంధ ఆలయాల్లో ప్రదర్శనలు కోలాటం, చెక్క భజనలు పండరి భజనల ప్రదర్శనలకు ఈవో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా భువనేశ్వరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా చిరంజీవమ్మ, కోశాధికారిగా దిలీప్‌ కుమార్‌, జిల్లా నాయకులుగా రెడ్డప్ప, రాజేంద్ర నాయుడు, కటారి కృష్ణారెడ్డి, రామచంద్రన్‌, పి.భగవతి బాలాజీ నాయక్‌, గంగిరెడ్డి, రామిశెట్టి, వెంకటరామయ్య, వెంకలక్ష్మీ, కాంచన, కుమారస్వామి, కృష్ణప్ప, చంద్రప్ప, రెడ్డి కృష్న, బి.నరసింహ నాయక్‌, లక్ష్మీదేవి, ఈశ్వరయ్య, నాగరాజు, వి.సునీత, రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 26 మండలాల నుంచి సుమారు 300 మంది కళాకారులు, గురువులు హాజరయ్యారు.