సదుం (చిత్తూరు) : సదుం మండలం జాండ్రపేటలో ఇద్దరి హత్య కలకలం రేపింది. వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్న రాధా, వెంకటేషులపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు బండరాయితో మోది చంపినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన ఇద్దరు మదనపల్లి ప్రాంతానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.










