Jul 27,2023 08:49

వ్యవసాయ అధికారులతో మాట్లాడుతున్న జెడిఎ ఉమామహేశ్వరమ్మ

          అనంతపురం : ఖరీఫ్‌ 2023లో సాగు చేసిన పంటలను క్షేత్ర స్థాయికి వెళ్లి ఈ క్రాప్‌ నమోదు చేయాలని రైతు భరోసా కేంద్రం అగ్రికల్చర్‌ అసిస్టెంట్స్‌కు జిల్లా వ్యవసాయ అధికారిణి యు.ఉమామహేశ్వరమ్మ సూచించారు. బుధవారం స్థానిక అనంత కషి భవన్‌లో అనంతపురం వ్యవసాయ డివిజన్‌ పరిధిలోని మండల వ్యవసాయ అధికారులు, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్స్‌కు వ్యవసాయ శాఖ పథకాలపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏడీఏ ఎం.రవి అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా జెడిఎ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతులకు అందించే ప్రతి కార్యక్రమం వారికి చేరువ చేయాల్సిన బాధ్యత వ్యవసాయ సిబ్బందిపై ఉందన్నారు. ఈ క్రాప్‌ నమోదులో ఎటువంటి అలసత్వం లేకుండా పూర్తి వివరాలు సేకరించాలని చెప్పారు. రైతుభరోసా కేంద్రం ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు ప్రసాద్‌, శ్యామ్‌ సుందర్‌ రెడ్డి, జె.శశికల, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.