Aug 21,2023 00:21

జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ ఈనెల 23న బుధవారం స్థానిక పివికెఎన్‌ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించే మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. జాబ్‌మేళాకు సంబంధించి గోడిపతులను ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందులో అమర రాజా గ్రూప్‌, అపోలో ఫార్మసీ, డిక్సన్‌ టెక్నాలజీస్‌, ఫ్లిప్‌కార్ట్‌, చాతుర్య స్కిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కోజెంట్‌ ఈ సర్వీసెస్‌, పేటీయం, ఫింకేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, బ్లూస్టార్‌ క్లయిమేటిక్‌ లిమిటెడ్‌, హెచ్‌డిబి పైనాన్సియల్‌ సర్వీసెస్‌, మహీంద్రా హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, ట్రాన్స్‌ హోమ్‌ ఇండియా సర్వీసెస్‌, ముతూట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, అగిల్‌ ఎయిర్పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, ఫ్లస్‌ ఎస్‌ ఇన్స్ట్రుమెంట్స్‌, భారత్‌ ఫైనాన్సియల్‌ ఇంక్లూషన్‌ లిమిటెడ్‌, టిసిఎల్‌ కంపెనీల వారు మెగా జాబ్‌ మేళా లో పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. కనీస విద్యార్హత పదవ తరగతి, ఇంటర్‌, డిగ్రీ ఫెయిల్‌, పాస్‌ అయిన 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు హాజరు కావచ్చునని తెలిపారు. ఈ జాబ్‌ మేళాను నిరుద్యోగ యువత సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివద్ధి అధికారి ఎన్‌.గుణశేఖర్‌, జిల్లా ఉద్యోగ ఉపాది అధికారి పద్మజ తదితరులు పాల్గొన్నారు. 78931 10120, 63009 54441, 95056 01887 ఫోన్‌నంబర్లు సంప్రదించాల్సిందిగా తెలిపారు.