ఇవిఎంల గదిని పరిశీలిస్తున్న కలెక్టర్ ఎం.గౌతమి
అనంతపురం కలెక్టరేట్ : ఇవిఎంలను భద్రపరిచిన గదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని కలెక్టర్ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని పాత ఆర్‌డిఓ కార్యాలయంలో భద్రపరిచిన ఎన్నికల సామగ్రిని కలెక్టర్ గౌతమి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గదుల్లో పొడి వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. గోడల్లో ఏ మాత్రం చెమ్మ కనిపించినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ గాయత్రిదేవి, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ భాస్కర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.










