Jul 13,2023 08:52

చంద్రమోహన్‌రెడ్డిని అభినందిస్తున్న విసి తదితరులు

       అనంతపురం : అనంతపురం జెన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాల ఈసీఈ విభాగాధిపతిగా డాక్టర్‌ ఎస్‌.చంద్రమోహన్‌ రెడ్డి బుధవారం భాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఉపకులపతి జి.రంగజనార్ధన, రెక్టార్‌ ఎం.విజయ కుమార్‌, రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌లు తనపై నమ్మకం ఉంచి ఈ పదవిని అప్పగించారన్నారు. ఉపకులపతి, రెక్టార్‌, రిజిస్ట్రార్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ నేతత్వంలో ఇంజినీరింగ్‌ కళాశాల అభివద్ధికి తన వంతు కషి చేస్తామని తెలిపారు. ఈ సందర్బంగా ఉపకులపతి రంగజనార్ధన, వర్శిటీ అకడమిక్‌ డైరెక్టర్‌ సుమలత, కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌వి.సత్యనారాయణ, వైస్‌ ప్రిన్సిపాల్‌ అరుణక్రాంతి, డాక్టర్‌ యస్‌.చంద్రమోహన్‌రెడ్డిని అభినందించారు. ఈకార్యక్రమంలో ఈసీఈ విభాగం బోధనా సిబ్బంది డాక్టర్‌ మమత, విష్ణు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.