ప్రజాశక్తి-ఉరవకొండ: అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డిని గురువారం ఆలయ అధికారులు,అర్చకులు ఆహ్వానించారు. ఆలయ ఈవో విజయ్ కుమార్, అర్చకులు ద్వారాకనాథ్ స్వామి, తదితరులు అనంతపురంలోని వారి నివాసంలో విశ్వేశ్వరరెడ్డిని కలిసారు. విశ్వేశ్వరరెడ్డి దంపతులను శాలువా, పూలమాలలతో సత్కరించారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. ఈనెల 13 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని 10న మహారథోత్సవం ఉంటుందని ఆయనతో చెప్పారు. రథోత్సవ కార్యక్రమానికి తప్పక హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని విశ్వేశ్వరరెడ్డిని కోరారు.










