Mar 15,2023 14:46

ప్రజాశక్తి-పాలకొల్లు :  పాలకొల్లు పట్టణంలోని 7 కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. దాదాపు ప్రతి సెంటర్లో అరగంటకు ముందే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో చేరుకున్నారు. గ్రామీణ విద్యార్థులు సైతం ముందుగానే ఆయా సెంటర్లకు  చేరుకున్నారు. పరీక్ష కేంద్రంల వద్ద 144 సెక్షన్ తోపాటు పోలీసులను ఏర్పాటు చేశారు. అరగంట ముందే పరీక్ష కేంద్రం లోనికి అనుమతిస్తున్నారు. దాదాపు 200 మంది విద్యార్థులు పట్టణంలో తొలి సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు.