Apr 24,2023 16:46
  • ప్రజాశక్తి వార్తకు స్పందన..

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బాలల పాఠశాలలో మైదానంలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం పెవీలియన్ శిథిలావస్థకు చేరి తాగుబోతులకు ఆకతాయిలకు అడ్డాగా మారి చెత్తాచెదారం మందు బాటిల్లతో దుర్వాసన వెదజల్లుతుండడంతో ముఖ్యమంత్రి వస్తున్న మోక్షానికి నోచుకోని ఇండోర్ స్టేడియం అన్న కథనం ఆదివారం ప్రజాశక్తిలో రావడంతో జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ గౌతమి ఆదేశాల మేరకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సీఈవో కేశవ నాయుడు ఎంపీడీవో దివాకర్ ఈఓఆర్డి లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో సోమవారం అపరిశుభ్రంగా ఉన్నటువంటి పెవీలియంలోని చెత్తాచెదారం తొలగించి బ్లీచింగ్ చల్లి పరిశుభ్రంగా చేశారు తిరిగి ఆకతాయిలు పెవీలియన్ భవనంలోకి చేరకుండా ఉండడానికి విరగొట్టిన తలుపులను వేయించి బంద్ చేయించనున్నట్లు సీఈఓ కేశవ నాయుడు తెలిపారు. మండల కేంద్రంలో మండల మెజిస్ట్రేట్ కార్యాలయం అయినా స్థానిక తహసిల్దార్ శిథిలావస్థకు చేరడంతో అధికారులు కార్యాలయ నిర్వహణకు ప్రత్యామ్నాయ భవనం వెతుకుతున్నారని నిరుపయోగంగా ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం పెవిలియన్ భవనాన్ని తాత్కాలిక తాసిల్దార్ కార్యాలయం నిర్వహణకు వినియోగిస్తే బాగుంటుందని పరిసర ప్రాంత ప్రజలు చెత్తాచెదారం వేయకుండా అన్ని విధాల ఆహ్లాదకర వాతావరణంలో కార్యాలయ నిర్వహణ బాగుంటుందని వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే వారు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని దీనిపైన ఉన్నతాధికారులు ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలని పలువురు స్థానికులు అంటున్నారు.