ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురం నగరంలో న్యూటౌన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు పూర్తయినప్పటికీ ఇప్పటిదాకా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదన్నారు. పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయకపోగా ఇప్పటికే ఫస్ట్ యూనిట్ టెస్ట్ సెకండ్ టెస్ట్ కూడా పూర్తి చేశారన్నారు. ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండానే పరీక్షలు పూర్తి చేసిన ప్రభుత్వానికి ఏమాత్రం ఆలోచన జ్ఞానం లేదని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతుంటే ఆ విద్యార్థుల అర్ధాకలితో విద్యను అభ్యసించాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని, మధ్యాహ్న భోజనం పున ప్రారంభించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహకారదర్శి సిద్దు, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ నాయకులు శివ పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ న్యూటౌన్ జూనియర్ కళాశాల కమిటీ ఎన్నిక
ఎస్‌ఎఫ్‌ఐ న్యూటౌన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్ తెలిపారు. న్యూటౌన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కార్యదర్శిగా బాలు, అధ్యక్షుడు మాదేశ్, ఉపాధ్యక్షులుగా సుదర్శన్, అనిల్, మహేష్, లక్ష్మీకాంత్, గురుప్రసాద్‌తో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
నూతన కమిటీతో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్










