Sep 11,2023 22:14

శిలాఫకాన్ని ఆవిష్కరిస్తున్న స్పీకర్‌ సీతారాం

* శాసనసభ స్పీకర్‌ సీతారాం
ప్రజాశక్తి- పొందూరు: 
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని వి.అర్‌.గూడెంలో రూ.80 లక్షల అంచనాలతో జలజీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా ఇంటింటా తాగునీటి కుళాయిలకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. తాగునీటి అవసరాన్ని గుర్తించి జల జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి ఇస్తున్నామన్నారు. అనంతరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించి సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపిపి కిల్లి ఉషారాణి, పిఎసిఎస్‌ అధ్యక్షులు కె.రమణమూర్తి, వైసిపి మండల అధ్యక్షులు పప్పల రమేష్‌కుమార్‌, ఎఎంసి చైర్మన్‌ బాడాన సునీల్‌కుమార్‌, నాయకులు నాగేశ్వరరావు, అప్పలనాయుడు పాల్గొన్నారు.
ట్రస్టు సేవలు విస్తృతం
బూర్జ :
ఇందుమతి, శ్రీరామ్మూర్తి ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా విస్తృతంగా సేవలు అందిస్తున్నట్లు సీతారాం అన్నారు. మండలంలోని గుత్తావల్లి, బూర్జ ఆమదాలవలస మండలం అక్కులపేట పిహెచ్‌సిలకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను వైద్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి కర్నెన దీప, జెడ్‌పిటిసి బెజ్జపురం రామారావు, మండల పార్టీ అధ్యక్షులు, టిడ్కో రాష్ట్ర డైరెక్టర్‌ కండాపు గోవిందరావు, వైస్‌ ఎంపిపిలు బుడుమూరు సూర్యారావు, కరణం కృష్ణంనాయుడు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గుమ్మడి రాంబాబు పాల్గొన్నారు.