ఇంటింటా సర్వే బాధ్యతగా నిర్వహించాలి
డిఎంఅండ్ హెచ్‌ఒ ప్రభావతిదేవి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రభావతి దేవి ఆధ్వర్యంలో బుధవారం జిల్లాలోని ప్రోగ్రాం అధికారులు స్టేట్ కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జూమ్ కాన్ఫరెన్సుకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన 'జగనన్న రక్ష' కార్యక్రమానికి ప్రతి ఒక్కరు బాధ్యతతో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మానిటర్ చేస్తూ ఈనెల 30 నుంచి జరగబోయే స్పెషల్ మెడికల్ క్యాంప్స్‌లో ప్రజలందరూ తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఎక్కడ కూడా ప్రత్యేక పరీక్షల నిమిత్తమై గాని, మందుల పంపిణీ విషయంలో కానీ ఎలాంటి లోటుపోట్లు లేకుండా ప్రోగ్రాం అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ రవిరాజు, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ సందీప్, వాణిశ్రీ, రేణుక ప్రభ తదితర అధికారులు పాల్గొన్నారు.










