ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ ఇంటింటా ఓటరు నమోదు కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలను పిలవాలి. ప్రధాన పార్టీలు వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి ఒక్కటే ఉంటే చాలా, మిగతా పార్టీలకు ఎందుకు పిలవరంటూ సిపిఎం రాప్తాడు నియోజకవర్గం నాయకులు నిరసన తెలిపారు. బుధవారం ఎంపిడిఓ కార్యాలయంలో సిపిఎం మండల నాయకులు రామాంజినేయులు, ఆత్మకూరు శివ శంకర్, పోతులయ్య, కనగానిపల్లి కదిరప్పలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమానికి సిపిఎంగా తమను బిఎల్‌ఓలు పిలవడం లేదన్నారు. ఎన్నికల నియామావళి ప్రకారం సిపిఎంగా అధికారులకు దరఖాస్తు పత్రాలు అందజేశామన్నారు. బిఎల్‌ఓలు మాత్రం మాకు మీ పేర్లు రాలేదంటూ చెబుతున్నారని తెలిపారు. ఇప్పుడు నిరసన తెలియజేస్తున్నా కూడా ఓటరు నమోదుకు కార్యక్రమంలో తమను పిలవకపోవడం సరికాదన్నారు. అధికారులు మాత్రం గడువులోగా మీ పార్టీ ఏజెంట్‌ల వివరాలు అందించలేదంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మరీ కొడిమి పంచాయతీలో 3వ తేదిన ఏజెంట్ వివరాలు అందించామని అయినా అక్కడ కూడా పిలవడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పదించి జరుగుతున్న జాప్యాన్ని సరిచేయాలన్నారు.
కింద కూర్చొని నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు










