Oct 12,2023 19:48

కరపత్రాలు పంచుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి -కందుకూరు :నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ్జ ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాలతో కందుకూరు పట్టణంలోని 3వ వార్డ్‌ ఉప్పు చెరువు ఏరియాలో 'బాబుతో నేను' కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు అక్రమ అరెస్టు, స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో వాస్తవాలు, జగన్‌ కుట్రల గురించి కరపత్రాల ద్వారా వివరించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు మాట్లాడారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకపోయినా, ఆయన అరెస్టు చేసి జైల్లో పెట్టారని, అదంతా జగన్‌ రాజకీయ కక్షలో భాగమని నేతలు పేర్కొన్నారు. వార్డు అధ్యక్షుడు పువ్వాడి కోటయ్య, వేముల ప్రసాద్‌ చుండూరు శ్రీను, షేక్‌ కరిముల్లా, కంసాని మయూరి, యర్రా ముసలయ్య, ఇత్తడి సురేష్‌ నాయకులు నాదెళ్ల వెంకట సుబ్బారావు, గోచిపాతల మోషే, చిలకపాటి మధు, వడ్డెళ్ళ రవిచంద్ర, బెజవాడ ప్రసాద్‌, రెబ్బవరపు మాల్యాద్రి, షేక్‌ మున్నా, షేక్‌ సలాం, షేక్‌ రూబీ, షేక్‌ ఫిరోజ్‌, సయ్యద్‌ జియావుద్దీన్‌, షేక్‌ గౌస్‌ బాషా, మచ్చ మనోహర్‌, గుమ్మ శివ, అత్తంటి శివకష్ణ ఉన్నారు.