Sep 16,2023 23:54

ఇంటి వద్దకే వైద్యసేవలు

ఇంటి వద్దకే వైద్యసేవలు
ప్రజాశక్తి- సోమల: ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి చరణ్‌ అన్నారు. శనివారం మండల కేంద్రమైన సదుంలోని పలు వీధులలోని ఇండ్లకు వెళ్లి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు మాత్రలు అందజేసి మిగిలిన ఆరోగ్య సమస్యలను ప్రభుత్వం అందజేసిన దరఖాస్తు లో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.