Jun 29,2022 22:42

ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు
గడపగడపకు మన ప్రభుత్వంలో డిప్యూటీ సిఎం
ప్రజాశక్తి- కార్వేటినగరం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతత్వంలో వైసిపి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలను అందిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. బుధవారం మండలంలోని డిఎంపురం పంచాయతీలో ఎంపీపీ లతబాలాజీ, ఎంపిటిసి ధనశేఖర్‌ యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ కష్ణయాదవ్‌లతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజల సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత వైయస్‌ఆర్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గతంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించిన దాఖలాలు లేవన్నారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పథకాలు అందుతున్నాయన్నారు. కొత్తడేరా కండిగ్రలో పుట్టుకతో వికలాంగురాలై మంచానికే పరిమితమైన ప్రీతి పరిస్థితి చూసి చలించిన డిప్యూటిసిఎం ఆమెకు వెంటనే నెలకు రూ.5 వేలు పింఛన్‌ మంజూరు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న భానుప్రియ ఓదార్చి రూ.50వేలతో పాడి ఆవులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్‌ ధనంజయ వర్మ, రాష్ట్ర యువత ప్రధానకార్యదర్శి ధనంజయరెడ్డి, వెంకటరత్నం, యుగంధర్‌ నాయుడు, మునస్వామి, లక్ష్మయ్య, వెంకటేష్‌, శేఖర్‌రాజు, చంద్రశేఖర్‌రాజు, పద్మనాభ శెట్టి, విద్యుత్‌ ఏడిఈ నాగరాజు, ఎంపీడీవో చిన్నరెడ్డెప్ప, తహశీల్దార్‌ అమర్నాథ్‌, ఎంఈఓ విజరుకుమార్‌, పురంధర్‌ పాల్గొన్నారు.