ప్రజాశక్తి-రాయదుర్గం పట్టణంలోని ఇండోర్ స్టేడియం పట్ల ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చొరవ చూపకపోవడం వల్ల పనులు అర్ధాంతరంగా ఆగి ముళ్లపొదల మయమైందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. తన 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్‌లో భాగంగా కాలవ ఇండోర్ స్టేడియం దుస్థితిపై సోమవారం 15వ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. నియోజకవర్గంలో క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టిడిపి ప్రభుత్వం ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేసిందని, అయితే స్థలం సమస్య వల్ల వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించలేకపోయామన్నారు. అనంతరం మోడల్ స్కూల్ పక్కన స్టేడియం పనులను ప్రారంభిం చామన్నారు. అయితే పునాదుల దశలోనే ఎన్నికలు రావడం, ఎమ్మెల్యేగా కాపు గెలవడంతో స్టేడియం నిర్మాణం పనులు ముందుకుసాగలేదన్నారు. ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంత యువకులను క్రీడల్లో ప్రోత్సహించడానికి ఇండోర్ స్టేడియం ఎంతగానో దోహదపడుతుందని, ఇకనైనా ఎమ్మెల్యే చొరవ చూపి స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఇండోర్ స్టేడియం వద్ద కాలవ సెల్ఫీ ఛాలెంజ్










