Jul 13,2022 22:53

ఇండ్ల నిర్మాణాలు ఊపందుకోవాలి: కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
జగనన్న కాలనీలలో ఇండ్ల నిర్మాణాలు ఊపందుకోవాలని జిల్లాకలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం జీడి నెల్లూరు మండలంలో జిల్లా కలెక్టర్‌ పర్యటించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న కాలనీలలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఇంకనూ గహనిర్మాణాలు చేయని లబ్ధిదారులు ఇంటి నిర్మాణపనులు ప్రారంభించేలా అవగాహన తీసుకొని రావాలన్నారు. ఈ పర్యటనలో భాగంగా కోటగారం పంచాయతీ ఒడ్డిపల్లి లేఔట్‌లో ఇండ్ల నిర్మాణాల పురోగతిని జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ లేఔట్‌లో మొత్తం 27 ఇండ్లు మంజూరు కాగా.. ఇందులో బిబిఎల్‌16 బిఎల్‌ 10 ఆర్‌ఎల్‌ స్థాయిలో ఒకటి ఉందని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌కి వివరించారు. ఇంటి నిర్మాణపనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ తెలిపారు. అనంతరం ఎట్టేరి వద్ద నిర్మాణదశలో ఉన్న ఎంపీఎఫ్‌సీ గౌడౌన్‌ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే కోటగారం సచివాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసి పథకాలవారీగా అర్హులు, అనర్హుల జాబితాలను పరిశీలించారు. ఈ సచివాలయ పరిధిలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌కు వివరించారు. కోటగారం సచివాలయపరిధిలో డ్రాప్‌అవుట్‌లు లేరని పాఠశాలలోని విద్యార్థులకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కల్పించడం జరుగుతున్నదని మహిళా పోలీసు కలెక్టర్‌కు వివరించారు.