ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ చిత్తూరు ఇవి ప్రభుత్వం, అధికారపార్టీ నేతలు చెబుతున్న పెద్దపెద్ద మాటలు... తడి, పొడిచెత్త వేర్వేరు బుట్టల్లో అందించండి సంపద సృష్టిస్తాం.. వర్మీ కంపోస్టు తయారు చేస్తాం.. ఏక్కడా చెత్తనిల్వ ఉండటానికి వీలులేదు.. ప్రతి రోజూ ఇంటింటా చెత్త సేకరణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్వచ్ఛ చిత్తూరుకు సహకరిచండి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులు తరతూ చెబుతున్న మాటలివి.....
జనాల మధ్యలో ఉన్న డంపింగ్ యార్డు నగరపాలక సంస్థ అధికారులకు కనిపించకపోవడం దారుణం ఆవాసాల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్ కష్టాలను ప్రత్యక్షంగా లెనిన్‌నగర్, మంగసముద్రం హాసింగ్ కాలనీ, బిడి కాలనీలోని పేదలు డపింగ్ యార్డు కంపును భరిస్తూ రోగాల భారిన పడుతున్నారు. నెత్తి నేరుకొట్టుకుంటూ డంపింగ్ యార్డు కంపును భరించలేక పోతున్నామంటూ సుదీర్ఘ పోరాటం చేస్తున్నా నగరపాలక సంస్థ అధికారుల చెవికెక్కడం లేదు. నగరంలోని చెత్తనంతా డంప్ చేస్తున్న డంపింగ్ యార్డు చూట్టు ఉన్న దాదాపు రూ.1500 నుంచి 2000లు కుటుంబాలు కంపును భరిస్తూ జీవనం సాగిస్తున్నారు.
వర్షాకాలంలో డంపింగ్ యార్డు చుట్టుపక్కల ఉన్న ప్రజలు రోగాల భారినపడుతున్నారు. ఎండా కాలంలో చెత్తను కాల్చడంతో దట్టమైన పొగతో దుర్వాసనతో రెండుమూడు కిలోమీటర్ల వరకు వ్యాపించి ప్రజలను ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్దులు శ్వాసకోస వ్యాధులతో బాధపడుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో డపింగ్ యార్డు నుండీ వచ్చే కంపుతో ముద్ద మింగుపడ్డం లేదని డంపింగ్ యార్డు సమీపంలోని పేదలు వాపోతున్నారు.
70 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు
చిత్తూరు నగరంలో మంగసముద్రం వద్ద 30 ఎకరాల్లో 70 ఏండ్లకు ముందు డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు నగరంలోని చెత్తను డంపింగ్ చేసేందుకు ఈ యార్డునే ఉపయోగిస్తున్నారు. జనాభా పెరిగింది. మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా అవతరించింది. డంపింగ్ యార్డు చుట్టూ పేదల కాలనీలు ఏర్పడ్దాయి. ఆటో, బిడి, భవన నిర్మాణ కార్మికులు పెద్దసంఖ్యలో డపింగ్ యార్డు చుట్టూ ఉన్న కాలనీల్లో నివాసం ఉంటున్నారు. టన్నుల కొద్ది రోజూ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న చెత్త కంపును భరిస్తూ జీవనం సాగించాల్సి వస్తోంది.
డపింగ్ యార్డు మార్పు ఎప్పటికో..
ఆవాసాల మధ్య ఉన్న డంపింగ్ యార్డు మార్పు కోసం గత ప్రభుత్వం మూడో గేటు బండపల్లి మార్చేందుకు కౌన్సిల్ ఆమోదంతో మార్పుకు ప్రయత్నించింది. బండపల్లి గ్రామాస్తులు తమ ప్రాంతాంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడంవల్ల పంటపొలాలు దెబ్బతింటాయని వ్యవసాయబోర్ల నీరు కలుషితం అవుతుందని కోర్టు ఆశ్రయించడంతో డంపింగ్ యార్డు తరలింపు మొదటికి వచ్చింది. ఆవాసాలకు దూరంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా నగర శివారప్రాతంలో నగరంలోని చెత్తను డంప్ చేసేలా డంపింగ్ యార్డును మార్చాలని మంగసముద్రం హాసింగ్ కాలనీ, లెనిన్ నగర్, బిడి కాలనీ వాసులు కోరుతున్నారు.
వెంటనే డంపింగ్ యార్డ్‌ను తరలించాలి
వి. గంగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి
చిత్తూరు నగరంలోని లెనిన్‌నగర్ వద్ద వేలాది మంది పేద ప్రజలు నివాసాల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే తరలించాలని శనివారం సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు సందర్శించి డిమాండ్ చేశారు. చిత్తూరు నగరం రోజురోజుకి విస్తరిస్తూ ఉండడంతో చెత్త కూడా భారీస్థాయిలో చేరుతున్నది. గత 50 సంవత్సరాల క్రితం నుండి వాడుతున్న డంపింగ్ యార్డ్ గతంలో చెత్త తక్కువగా ఉండడం వలన సమస్య అంత తీవ్రత లేదన్నారు. అయితే ప్రస్తుతం నగరం విస్తరించి డంపింగ్ యార్డ్ చుట్టూ కాలనీలో ఏర్పడ్డాయి. ఎంత వేలాది మంది పేదలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. నివాసాలున్న ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్‌కు ప్రత్నామ్యాయ మార్గం చూడకుండా ఇక్కడే కొనసాగడం వలన చెత్త గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్నది. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో ఇంత దారుణమైన పరిస్థితి ఉండడం సరైనది కాదు. నిత్యం మంత్రులు జిల్లా కేంద్రానికి వస్తున్నప్పటికీ ఈ సమస్యపై ఎందుకు దష్టిపెట్టడం లేదు. జిల్లా కలెక్టర్, నగర కమిషన్ ప్రజాఆరోగ్యానికి కాపాడాల్సిన బాధ్యత ఉంది.










