May 05,2023 22:11

రెడ్‌క్రాస్‌ సొసైటీ నూతన కార్యవర్గం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న విప్‌ కాపు

         ప్రజాశక్తి-రాయదుర్గం   ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ అనంతపురం జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఏకగ్రీవమైంది. ఛైర్‌పర్సన్‌గా కాపు భారతి మరోమారు ఎన్నికయ్యారు. అనంతపురం నగరంలోని కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఉన్న రెవెన్యూ భవన్‌లో శుక్రవారం రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఎన్నికలు నిర్వహించగా జిల్లా కోఆపరేటివ్‌ అధికారి ప్రభాకర్‌ రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ముందుగా 13 మంది కార్య వర్గ సభ్యులను ఎన్నుకొన్నారు. వారిలో కాపు భారతి సొసైటీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నిక య్యారు. అలాగే ఉపాధ్యక్షుడిగా లక్ష్మీప్రసాద్‌, కోశాధికారిగా మల్లికార్జున, రాష్ట్ర క మిటీ సభ్యుడిగా కాపు రామచంద్రారెడ్డితో పాటు మరో 9 మందిని కార్యవర్గ సభ్యు లుగా ఎన్నుకొన్నారు. అనంతరం నూతన కార్యవర్గం చేత ఎన్నికల అధికారి ప్రమా ణ స్వీకారం చేయించారు. ప్రతి మూడేళ్లకోసారి రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఎన్నికలు జరు గుతాయి. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం 2026 మే 5వ తేదీ వరకూ కొనసాగు తుందని ఎన్నికల అధికారి తెలిపారు. నంద్యాల, తిరుపతి జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర పరిశీలకులు ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. కాపు భారతి ఎన్నికపై స్థానిక వైసిపి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆమె చేసిన సేవలకు గుర్తింపు ఛైర్‌పర్సన్‌ పదవి అని వారు అభివర్ణించారు.