Oct 17,2023 19:51

మాట్లాడుతున్న ఎంపి ఆదాల ప్రభాకర్‌రెడ్డి

మాట్లాడుతున్న ఎంపి ఆదాల ప్రభాకర్‌రెడ్డి
ఇందిరమ్మ కాలనీలో
అభివద్ధి పనులకు శంకుస్థాపన
ప్రజాశక్తి-నెల్లూరు:రూరల్‌ నియోజకవర్గంలోని 24వ డివిజన్‌ కనపర్తిపాడు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో పలు అభివద్ధి నిర్మాణ పనులకు పార్లమెంట్‌ సభ్యులు, రూరల్‌ ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి శంఖుస్థాపన చేశారు. మంగళవారం ఇందిరమ్మ కాలనీలో తారు రోడ్డు నిర్మాణ పనులప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గడచిన 6 నెలల కాలంలో 24వ డివిజన్‌ అభివద్ధి కోసం రూ. 5 కోట్లు మంజూరు చేయడం అనేది సామాన్యమైన విషయం కాదన్నారు. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులను దష్టిలో ఉంచుకొని, ఇక్కడ ఎక్కువమంది పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతం కాబట్టి అందుకు తగ్గట్టుగానే అభివద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు.
ఇందులో భాగంగా కనపర్తిపాడు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో రూ. 47 లక్షలతో తారు రోడ్డు నిర్మాణం కు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో తాగునీటి అవసరాల కోసం డివిజన ఇంచార్జీలు, స్థానిక ప్రజలు చేసిన విజ్ఞప్తి మేరకు రక్షిత మంచినీటి వాటర్‌ ప్లాంట్‌ ను మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రతి పేద మధ్య తరగతి ప్రజల ఇంటిలో ఏదో ఒక సంక్షేమ లబ్ధి చేకూర్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో పేద, మధ్యతరగతి ప్రజల పక్షపాతిగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అండగా, నెల్లూరు పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిని, తనను ప్రజలు ఆశీర్వ దించాలని విజ్ఞప్తి చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చక్కగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య పరీక్షలు, అవసరమైన మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయరు పొట్లూరి స్రవంతి, రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య, సీనియర్‌ నాయకులు డివిజన్‌ ఇంచార్జి ఉడతా మురళీ యాదవ్‌, సిహెచ్‌ హరిబాబు యాదవ్‌ తదితరులు సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, 24వ డివిజన్‌ ముఖ్య నాయకులు సునీల్‌ యాదవ్‌, ఇసనాక సురేందర్‌ రెడ్డి, వెందోటి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి అశోక్‌ రెడ్డి, రామలింగారెడ్డి జగదీష్‌ రెడ్డి, దోర్నాల జగన్‌ మోహన్‌ రెడ్డి, మర్రి సుబ్బయ్య, బైనమోడీ పెంచలయ్య తదితరులతోపాటు రెండవ క్లస్టర్‌ అధ్యక్షులు పాతపాటి పుల్లారెడ్డి, పార్టీ సీనియర్‌ ఏంబేటి ఏసునాయుడు, కార్పొరేటర్లు ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి, మూలే విజయ భాస్కర్‌ రెడ్డి,తాళ్లూరు అవినాష్‌, క్లస్టర్స్‌ అధ్యక్షులు ముడియాల రామిరెడ్డి, టీవీఎస్‌ కమల్‌, బెజవాడ మేఘన సింగ్‌, మండల జెసిఎస్‌ కన్వీనర్‌ మోయల్ల సురేష్‌ రెడ్డి, జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారి కాటంరెడ్డి రవీంద్రరెడ్డి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వేలూరు శివ సునీల్‌ రెడ్డి, జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యూత్‌ అధ్యక్షులు మంగళ పూడి శ్రీకాంత్‌ రెడ్డి, జడ్పిటిసి సభ్యులు మలు సుధాకర్‌ రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్‌ అధ్యక్షులు పాలకీర్తి రవికుమార్‌, పద్మజ యాదవ్‌ పాల్గొన్నారు