ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : మండలంలోని పాటపేట పంచాయితీలోని శివ లైయములో ఓ వ్యక్తి మద్యం విక్రయిస్తున్నారు అని సమాచార అందడంతో ఎస్సై వెంకట నరసిహులు తన సిబ్బందితో కలిసి శివారులో దాడి చేశారు. అక్కడున్న కాలెప్ప వద్ద నుండి 90ఎంఎల్ ఒరిజినల్ చాయిస్‌కు చెందిన 72 కర్ణాటక టెట్రా ప్యాకెట్లు మరియు నిందితున్ని అదుపులోకి చేసుకొని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై వెంకట నరసింహులు ఒక ప్రకటనలో తెలియపరిచారు.










