- అనంతపురం డివిజన్ ఏడీఏ ఎం.రవి
ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం వ్యవసాయ డివిజన్ ఏడీఏ మీనల రవి ఆధ్వర్యంలో అనంతపురం నగరం ఆర్.టి.సి బస్టాండ్ రోడ్డు లో ఎరువులు, విత్తన దుకాణాలు మధ్యాహ్నం తనిఖీ చేపట్టారు. ఇదే సందర్భంలో ఓ ఆటోలో తరలిస్తున్న ఉత్పత్తులను పరిశీలించారు. ఇందులో రాష్ట్రంలో నిషేధించిన గ్లైసిల్ గడ్డి మందు రూ.1.04 లక్షలు విలువైన 140 లీటర్లు తరలించడాన్నీ ఈ తనిఖీలో గుర్తించి తరలిస్తున్న ఆటో ను మరియు నిసేదితి గడ్డి మందు సీజ్ చేసి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వ్యవసాయ శాఖ నిసేదిత యాక్ట్ 1968 లోని సెక్షన్ 18, 21, &27 of Iఏ ప్రకారం విచారణ జరిపి అమ్మిన వారిపైన రవాణా చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఏ రవి తెలిపారు. రైతులు కానీ ఎరువుల, విత్తన,పురుగు మందులు డీలర్లు కానీ వ్యవసాయశాఖ నిసేదించిన ఉత్పత్తులు అమ్మినా, కొన్నా, రవాణా చేసినా కూడా త్రీవ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీ లో అనంతపురం మండల వ్యవసాయ అధికారి జె.శశికళ తదితరులు పాల్గొన్నారు.










