Jun 29,2022 22:44

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి: కమిషనర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

నగరపాలక సంస్థ పరిధిలో జగనన్న హౌసింగ్‌ కాలనీల్లో ఇళ్లనిర్మాణాలను వేగవంతం చేయాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె. అరుణ హౌసింగ్‌ అధికారులను, అమినిటి కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కమిషనర్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. హౌసింగ్‌ కాలనీల్లో రోడ్ల నిర్మాణం దాదాపుగా పూర్తి అయినందున లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించేలా చూడాలన్నారు. లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ... వారు త్వరగా ఇళ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు. స్టేజ్‌ కన్వర్షన్‌ నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. గహనిర్మాణాల పురోగతిపై వార్డులవారీగా సమీక్షించారు. సమావేశంలో హౌసింగ్‌ ఏఈ శ్రీధర్‌ పాల్గొన్నారు.