Sep 21,2022 21:16

ఇళ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత
ప్రతి ఇంటిలో రెండో విడత ఫీవర్‌ సర్వే : కమిషనర్‌
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ :

జగనన్న హౌసింగ్‌కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం కమిషనర్‌ నగరపాలక సంస్థ పరిధిలో 49,50వ వార్డు సచివాలయ పరిధిలో విస్తతంగా పర్యటించారు. ఈసందర్భంగా కమిషనర్‌ చవటపల్లి, తిమ్మసముద్రం ప్రాంతాల్లో పలువురు లబ్ధిదారులను కలిసి మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు. అలాగే వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ, తడి,పొడి చెత్తసేకరణను పరిశీలించారు. పలు గహాల వద్ద నీటితొట్టెల్లో దోమల లార్వాలను పరిశీలించారు. డెంగీ జ్వరాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా 49,50వ సచివాలయాల్లో అధికారులు, వార్డు కార్యదర్శులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆస్తిపన్ను వసూళ్లు, హౌసింగ్‌, సంక్షేమ పథకాలు అమలు అంశాలపై కార్యదర్శుల వారీగా సమీక్షించారు. హౌసింగ్‌పై వాలంటీర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, క్లస్టర్‌ పరిధిలో మంజూరు చేసిన అన్ని గహాలు గ్రౌండింగ్‌ అయ్యేలా వాలంటీర్లు కషి చేయాలన్నారు. కార్పొరేటర్లు జ్ఞాన జగదీష్‌, ఎజి.సహదేవన్‌ సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, ఎంహెచ్వో అనిల్‌ కుమార్‌, డీఈ వెంకట ప్రసాద్‌, హౌసింగ్‌ ఏఈ శ్రీధర్‌, శానిటరీ ఇన్స్పెక్టర్‌ చిన్నయ్య, ఏఈ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.