Feb 27,2023 22:07

టిడ్కో ఇళ్లు వెంటనే అప్పగించాలి
జగనన్న ఇంటి నిర్మాణ సాయం రూ.6 లక్షలకు పెంచాలి
కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి
కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం
ప్రజాశక్తి - భీమవరం

               భీమవరం పట్టణంలో 82 ఎకరాల్లో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్‌ చేశారు. జగనన్న లేఅవుట్‌లో లబ్ధిదారులకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించాలని కోరారు. టిడ్కో ఇళ్ల, జగనన్న ఇళ్ల స్థలాల లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక కలెక్టరేట్‌ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. తక్షణం టిడ్కో గృహాల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడంతోపాటు జగనన్న ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వమే ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అందించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ టిడ్కో గృహాలను గత టిడిపి ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ శాతం నిర్మాణం పూర్తి చేశారని గుర్తు చేశారు. ఎన్నికలొచ్చాయని పనులు పూర్తి కాకుండానే హడావిడిగా ఇళ్ల స్వాధీన పత్రాలు ఇచ్చి గృహప్రవేశాలు చేయించారని ఆరోపించారు. కనీస, మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేదని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తయిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించలేకపోయిందని మండిపడ్డారు. కరోనా సమయంలో ఈ ఇళ్లను ఐసోలేషన్‌ కేంద్రాలకు వినియోగించడం మాత్రం చేశారన్నారు. లబ్ధిదారులు వడ్డీలకు వేలకు వేలు అప్పు చేసి డిపాజిట్లు కట్టారని, అయితే పూర్తయిన ఇల్లు కూడా లబ్ధిదారులకు స్వాధీనం చేయకపోవడంతో డబ్బులకు వడ్డీలు కట్టలేక ఇంటి అద్దె చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడమే కాక పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ వంటి ధరలు కూడా పెరిగి సామాన్య, మధ్యతరగతి అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే జగనన్న ఇళ్ల నిర్మాణ భారంగా మారిందన్నారు. నిర్మాణానికి లక్షలాది రూపాయలు వడ్డీలకు తీసుకొచ్చి అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే జగనన్న ఇంటి నిర్మాణనికి రూ.ఆరు లక్షలు మంజూరు చేయాలని, టిడ్కో ఇళ్లను త్వరగా పూర్తిచేసి మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో దశలవారీ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిఆర్‌ఒ కృష్ణవేణికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దూసి కళ్యాణి, నాయకులు ఎం.వైకుంఠరావు, వరలక్ష్మి, బొక్కా సత్యనారాయణ, డి.త్రిమూర్తులు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, అన్యం రాంబాబు, కాటం నాగరాజు, శ్రీను, కుమారి, రమేష్‌, ఏసు, వీరాస్వామి, గుడాల శ్రీను, లక్ష్మి, సత్యవతి పాల్గొన్నారు.
ఉండి: జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు ఇల్లు నిర్మాణానికి రూ.ఆరు లక్షలు ఆర్థిక సాయం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాల లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గోపాలన్‌ మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకిరాగానే లక్షలాది మందికి ఇళ్ల స్థలాలను కేటాయించామని ఆర్భాటంగా చెబుతున్నారని, అయితే అదంతా కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు. వాస్తవంలోకి ఇళ్ల స్థలాల కేటాయింపులు సరిగ్గా లేవని ఆయన విమర్శించారు. మండలంలో 2,473 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు అందజేయగా వారికి స్థలాలు చూపించడంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో ఇళ్లు నిర్మించడానికి చాలాగ్రామాల్లో మట్టి పూడిక చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాందువ్వ, కలిగొట్ల, ఉప్పులూరు, పాములపర్రు, ఆరేడు, ఎన్‌ఆర్‌పి.అగ్రహారం వంటి గ్రామాల్లో ఇప్పటి వరకు ఇళ్ల స్థలాల పూడిక సక్రమంగా జరగలేదని, అటువంటి చోట ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రాని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్థలాల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఆర్థిక సాయం అందించాలని, జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని గోపాలన్‌ డిమాండ్‌ చేశారు. అనంతరం మండల డిప్యూటీ తహశీల్దార్‌ ఎస్‌.వీరాస్వామినా యుడుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ధనికొండ శ్రీనివాస్‌, నాయకులు కొట్టాడ వెంకటేశ్వరరావు, చిప్పాడ బుచ్చేశ్వరరావు, చీర్ల శేషు, వీరవల్లి మాధవరావు, కిలారి తవిటినాయుడు, మాదాసు గోపీ, నక్కా వెంకటేశ్వర్లు, కడలి నాగేశ్వరరావు, కొల్లి రత్నకుమారి, కలిదిండి సూర్యనారాయణరాజు, పెళ్లూరి సుబ్రహ్మణ్యం, చిట్టిబాబు పాల్గొన్నారు.
ఆచంట: కొండెక్కిన నిర్మాణ సామగ్రి ధరలతో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం మరింత భారంగా మారిందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేతా గోపాలన్‌ అన్నారు. సోమవారం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జగనన్న కాలనీల్లో మౌలిక సదుపా యాలు కల్పించాలంటూ సిపిఎం ఆధ్వర్యాన ఆందోళన నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ రాజ్యలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపాలన్‌ మాట్లాడుతూ ఇంటి నిర్మాణానికి కనీసం రూ.ఆరు లక్షలు ప్రభుత్వం ఇవ్వాలని, లేనిప క్షంలో ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. జగనన్న కాలనీల్లో అన్ని వసతులూ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎస్‌విఎన్‌.శర్మ, సిర్రా నరసింహమూర్తి, వద్దిపర్తి అంజి బాబు, తోటపల్లి సత్యనారాయణ, కుసుమే జయరాజు, ఇందుకూరి సూర్యనారాయణరాజు, బొర్రా ధర్మారావు, సిర్రా విఘ్నేశ్వరుడు, బుల్లబ్బాయి, కొండేటి రాఘవులు, రాజు, శ్రీను పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: టిడ్కో ఇళ్లను ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు అందించాలని, జగనన్న కాలనీల్లో ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని, టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద హెల్త్‌ సెంటర్‌, అంగన్‌వాడీ సెంటర్‌ ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు, నేతలు కరెడ్ల రామకృష్ణ, గొన్నాబత్తుల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. టిడ్కో ఇళ్లను బ్యాంకు అప్పుతో సంబంధం లేకుండా ఉచితంగా ఇస్తామని హమీ ఇచ్చి మూడేళ్లు దాటినా ఇప్పటికీ ఇళ్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసొప్పడం లేదన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లించలేక, మరోవైపు ఇంటి అద్దె చెల్లించలేక లబ్ధిదారులు నానావస్థలు పడుతున్నారన్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వెంటనే చేపట్టకపోతే పట్టా రద్దు చేస్తామని బెదిరించడం దారుణమన్నారు. ఇంటి నిర్మాణానికి కనీసం రూ.6 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో చిటికిన రాము, జవ్వాది శ్రీను, శిద్దిరెడ్డి శేషుబాబు, గొర్రెల సతీష్‌, నరమాల కృష్ణ, మేట్రేటి రమణ, నర్మాల నారాయణరావు, కుంచంగి నానాజీ, ఏపూరి శ్రీను, కె.కొండలరావు, పోతు శ్రీను, అయినాల ధర్మారావు పాల్గొన్నారు.
యలమంచిలి: మండలంలోని నార్నిమెరక, మట్లపాలెం, పోలవరం తదితర గ్రామాల్లో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి కానేటి బాలరాజు మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో రోడ్లు, కరెంటు, తాగునీటి సదుపాయం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఇంటి నిర్మాణానికిచ్చే సొమ్మును రూ.6 లక్షలకు పెంచాలని కోరారు. ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే పట్టా రద్దు చేస్తామనడం దారుణమన్నారు. అనంతరం తహశల్దార్‌ నరసింహారావుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు బాతిరెడ్డి జార్జి, సరిపల్లి జయప్రభ, బాతిరెడ్డి సుగుణ, ఎడ్ల మోహనరావు, మాచవరపు సుబ్బారావు, గూడూరి నాగేశ్వరరావు, గూడూరి ఆంజనేయలు, గుబ్బల సత్యనారాయణ, కుమార్‌ పాల్గొన్నారు.
నరసాపురం: జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణానికి రూ.ఆరు లక్షలు ఇవ్వాలని, లేనిపక్షంలో ప్రభుత్వమే ఇల్లు ఉచితంగా నిర్మించి ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కవురు పెద్దిరాజు, పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ పట్టణంలో లబ్ధిదా రుల కోసం మంగళగుంటపాలెంలో సేకరించిన 90 ఎకరాల భూమి ని లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునేలా పూడిక చేయకపోవడం బాధాక రమన్నారు. వెంటనే ఆ స్థలాన్ని పూడిక చేసి రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రభు త్వం కనీసం రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనం తరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌ ఎమ్‌డి. ఫాజిల్‌కు అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు మంచిలి నీలకంఠం, పొన్నాడ రాము, బూడిద జోగేశ్వరరావు, పొగాకు నారా యణరావు, నోముల కొండచ జల్లి రామ్మోహన్‌రావు, ధనుంజరు, తెలగంశెట్టి సత్యనారాయణ, శివరాజు, బద్రి, మల్లేష్‌ పాల్గొన్నారు.
కాళ్ల: జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి ఆ పార్టీ మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ మాట్లాడుతూ ఇల్లు నిర్మించకపోతే స్థలాలు తీసుకుంటామని నేతలు, అధికారులు బెదిరించడం సరికాదన్నారు. ఇంటి రుణం రూ.ఆరు లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండా సూరిబాబు, యేసురత్నం, కోటేశ్వరరావు, యెహోషువా పాల్గొన్నారు.
తణుకు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జగనన్న ఇంటికీ రూ.6 లక్షలు ఇవ్వాలని, టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఉచితంగా ఇవ్వాలని, సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి పివి.ప్రతాప్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక తహాశీలార్‌ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహాశీల్ధార్‌ పిఎన్‌డి.ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఇసుక, సిమెంట్‌, ఇటుక ధర తగ్గించాలని, ఇంటి స్థలం రెండు సెంట్లు ఇవ్వాలని, గోస్తనీ మళ్లింపు భూమి 7.26 సెంట్లలో జగనన్న ఇళ్లు ఇవ్వాలని నినదించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ పట్టణంలో జగనన్న ఇళ్లు 7867 ఇచ్చినా నేటికీ వెయ్యి కూడా కట్టలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము పూడిక, బేస్‌మెంట్‌కూ చాలడం లేదన్నారు. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించకపోవడం వల్ల అవి దెబ్బతింటున్నాయన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అడ్డగర్ల అజయకుమారి, రంగారావు, గుబ్బల గోపి, నర్సింహరావు, టి.ధనలక్ష్మి, ఎన్‌.చిన్నారావు, సుధాకర్‌, ఎం.సువర్ణరాజు, టి.రామకృష్ణ, టి.వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, వీర్రాజు, ఎన్‌.రత్నం పాల్గొన్నారు.
పెనుమంట్ర: జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి కూసంపూడి సుబ్బరాజు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించి తహశీల్దార్‌ దండు అశోక్‌వర్మకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నేతలు తెన్నేటి ఆంజనేయులు, వెంకట్రారాజు, ఆంజనేయులు పాల్గొన్నారు.
పాలకొల్లు: టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి జవ్వాది శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల సముదాయం వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్మూర్తి, అజరుకుమార్‌, సోమేశ్వరరావు, టి.శ్రీనివాసరావు, సత్యనారాయణ, టి.గంగరాజు, గణేష్‌, పి.కృష్ణ, గురవయ్య, గుబ్బల త్రిమూర్తులు పాల్గొన్నారు.