Mar 20,2022 22:20

మురుగుతో నిండి ఉన్న కాలువ



పారిశుద్ధ్య లోపాన్ని పట్టించుకోని పురపాలక సిబ్బంది
ప్రజాశక్తి-పుత్తూరు టౌన్‌:
బ్రతుకు దెరువు కోసం రోడ్డు పక్కన చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వారు దోమల బెడద, జ్వరాలతో మంచాన పడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ మురుగును శుభ్రం చేయ్యమని అనేక పర్యాయాలు మున్సిఫల్‌ సిబ్బందికి చెప్పినా, అధికారులకు తెలిపినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో దోమలకు ఈ మురుగు కాలువ ఆవాశంగా మారి స్థానిక ప్రజలకు శాపంగా మారిన పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజారోగ్య సమస్యలు ఉత్పన్నం కాకముందే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. స్పందించకుంటే మున్సిఫల్‌ కార్యాలయం ముందు బైఠాయిస్తామని స్థానికులు చెబుతున్నారు.