May 16,2023 22:14

శ్రీనివాస రామానుజన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న జెఎన్‌టియు విసి రంగజనార్ధన

        అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మాసీ ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌-23 పరీక్షలకు మంగళవారం రెండోరోజు 94.45 శాతం మంది హాజరయ్యారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కలిపి ఇంజినీరింగ్‌కు 53,223 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 50,270 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు ఆంధ్రప్రదేశ్‌లో 48,862 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా 46,651 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. 95.48 శాతం హాజరు నమోదు అయ్యింది. తెలంగాణలో 4,361 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా 3,619 మంది విద్యార్థులు హాజరయ్యారని, 82.99 శాతం హాజరు నమోదు అయ్యింది. రెండు రాష్ట్రాల్లో కలిపి 53,223 మంది రిజిస్టర్‌ చేసుకోగా 50,270 మంది విద్యార్థులు హాజరు కాగ, 94.45 శాతం హాజరు నమోదు అయ్యింది. అనంతపురం ఎస్‌ఆర్‌ఐటి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఈఏపీసెట్‌ ఛైర్మన్‌ రంగజనార్ధన, సెట్‌ కన్వీనర్‌ శోభాబిందు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం జెఎన్‌టియు, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌-2023 పరీక్ష రెండవ రోజు సజావుగా జరిగిందన్నారు.