Apr 18,2023 21:34

ఈద్గాలో రంజాన్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మేయర్‌ వసీం

        ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌   రంజాన్‌ పండుగ సమీపిస్తున్న తరుణంలో నగరంలోని ఈద్గా మైదానంలో శుభ్రత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మేయర్‌ మొహమ్మద్‌ వసీం సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని హౌసింగ్‌ బోర్డు ఈద్గా మైదానంలో జరుగుతున్న పనులను అధికారులు, మైనార్టీ నేతలతో కలిసి మేయర్‌ పరిశీలించారు. ఇందులో భాగంగా పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం మేయర్‌ మాట్లాడుతూ పవిత్ర రంజాన్‌ పండుగను దృష్టిలో ఉంచుకుని ఈద్గా మైదానంలో ముళ్లపొదలు, చెత్తా చెదారం తొలగింపు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ ఎకెఎస్‌ ఫయాజ్‌, కార్పొరేటర్లు సైఫుల్లా బేగ్‌, బాబా ఫక్రుద్దీన్‌, అబూ సాలేహా, కార్యదర్శి సంగం శ్రీనివాసులు, ఎంహెచ్‌ఒ గంగాధర్‌రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.