May 05,2023 21:56

సమ్మెర్‌ క్యాంపు పోస్టర్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్‌ గౌతమి

      అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధీనంలో పనిచేస్తున్న గ్రంధాలయాలలో ఈ నెల 8 నుంచి జూన్‌ 6వ తేదీ వరకు సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌ ఎల్‌ఎం.ఉమామోహన్‌రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పి.రమ, ఉప గ్రంధాలయ అధికారిని వి.సుబ్బరత్నమ్మ పాల్గొన్నారు.