ఈ-క్రాప్‌పై అభ్యంతరాలు తెలపాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : మండలంలోని బండగానిపల్లి రైతు భరోసా కేంద్రం పరిధిలోని రైతులు జరిగిన ఈ-క్రాప్ బుకింగ్‌పై అభ్యంతరాలు ఉంటే తెలపాలని మండల వ్యవసాయ అధికారి ఆంజనేయులు, హార్టికల్చర్ అధికారిణి జయశ్రీ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని బండగానిపల్లి రైతు భరోసా కేంద్రం లో వారు రైతులతో సమావేశమై మాట్లాడారు. ఈ - క్రాప్ బుకింగ్‌పై సోషల్ ఆడిట్ నిర్వహించినట్లు. ఈ -క్రాప్ బుకింగ్‌లో లోపాలు ఏమైనా ఉంటే రైతులు తెలపాలని రైతులను కోరారు. ఈ క్రాప్‌లో నమోదైన పేర్లు రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంచామని ఈ అవకాశాన్ని ప్రతి రైతు ఉపయోగించుకొని తమ తమ సమస్యలను తెలిపి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. సిబ్బంది రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అందుబాటులో ఉంటారన్నారు. అనంతరం ఈ క్రాప్‌లో అభ్యంతరాలు లేని రైతులకు వారి పత్రాలను వారికి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ విఎఎ కనిష్క రెడ్డి, రైతులు పాల్గొన్నారు.










