ఈ-క్రాప్ నమోదు తప్పనిసరి
ప్రజాశక్తి- గుడిపల్లి: మండలంలో ఈ ఖరీఫ్ 2023 సీజన్ లో రైతులు సాగు చేసిన పంటలను తప్పని సరిగా ఈ నెల 25 లోపు ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నాగరాజు కోరారు. శుక్రవారం ఆయన మండలంలోని బెగ్గిలపల్లి కనమనపల్లి,కె.బి పల్లి,అగరం,పోగురుపల్లి,గ్రామ పంచాయతీలో ఈ-క్రాప్ నమోదును పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఈ-క్రాప్ నమోదు వలన కలిగే ప్రయోజనాలను తెలిపారు. ప్రకతి విపత్తుల వల్ల పంటలు నష్టపోతే పరిహారం, పంట రాయితీ పొందవచ్చని, సున్నా వడ్డీ, సబ్సిడీ పరికరాలు, ఎరువులు, విత్తనాలు, రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలకు అర్హత కూడా ఉంటుందన్నారు. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి నాగరాజు , రైతు భరోసా కేంద్రం ఇన్ చార్జిలు , రైతులు పాల్గొన్నారు.










