Oct 15,2022 21:44

ఈ క్రాప్‌ బుకింగ్‌ వేగవంతం చేయాలి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

ఐరాల మండలంలోని చిగరపల్లిలో ఈక్రాప్‌ నమోదును తీరును శనివారం ఉదయం జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తనిఖీ చేశారు. ఈసందర్భంగా చిగరపల్లికి చెందిన రైతులతో మాట్లాడి, రికార్డుల్లో నమోదు చేసిన వివరాలను తనిఖీ చేశారు. భూముల సర్వే నంబర్లు, పొలాల విస్తీర్ణం, రైతులు ఏ రకం పంటను ఎంత విస్తీర్ణంలో వేశారో, విత్తనాలు ఎక్కడ తీసుకున్నారో తదితర వివరాలు తెలుసుకున్నారు. ఆయా భూములకు నీటి సదుపాయంపైనా లేదా వర్షాలపై అదార పడి సాగు చేశారా అని ఆరా తీశారు. ఈ వివరాలను రికార్డుల్లో తనిఖీ చేసి, సంతప్తిని వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. తమ పంటను రైతులు ఎక్కడైనా విక్రయించే స్వేచ్చ ఉందని జాయింట్‌ కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో తహశీల్దార్‌ సుశీలమ్మ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.