Apr 20,2023 09:43

మూల్యాంకనాన్ని పరిశీలిస్తున్న డీఈవో ఎం.సాయిరామ్‌

         అనంతపురం సిటీ : అనంతపురం నగరంలోని కెఎస్‌ఆర్‌ ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి మూల్యాంకనం బుధవారం నుంచి ప్రారంభం అయ్యింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పదవ తరగతి జవాబు పత్రాలను ఉపాధ్యాయులు దిద్దారు. మూల్యాంకనం కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.సాయిరాం పరిశీలించారు. ఈ సందరద్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పదవ తరగతి జవాబు పత్రాలు రెండు లక్షలు అనంతపురం జిల్లాకు వచ్చాయన్నారు. వాటిని మూల్యాంకనం చేయడం కోసం 258 చీఫ్‌ ఎగ్జామినర్స్‌, 950 మంది అసిస్టెంట్‌ చీఫ్‌ ఎగ్జామినర్స్‌, 250 మంది స్పెషల్‌ అసిస్టెంట్స్‌ను నియమించినట్లు తెలిపారు. ఈనెల 26వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. విధులకు హాజరు అయిన సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, ఫ్యాన్స్‌, మెడికల్‌ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూల్యాంకనంకు కేటాయించిన కొందరు సిబ్బంది ఆరోగ్య సమస్యలు ఉన్నాయని విధులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. అలాంటి వారి మెడికల్‌ రిపోర్ట్స్‌ పరిశీలించి మినహాయింపు ఇస్తామని చెప్పారు.
నేడు ఆర్జేడీ ప్రతాప్‌ రెడ్డి రాక
ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్‌, కడప ఆర్జేడీ, పదో తరగతి పరీక్షల జిల్లా అబ్జర్వర్‌ బి.ప్రతాప్‌ రెడ్డి గురువారం అనంతపురానికి రానున్నారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న పది మూల్యాంకనాన్ని పరిశీలించనున్నారు.