Oct 31,2022 15:27

ఎదిగే బిడ్డకు ప్రాణదాతలు అవుదామని దృశ్యకళలు రాష్ట్ర అకాడమీ సభ్యుడు కూరపర్తి అంజిబాబు అన్నారు

ప్రజాశక్తి-చౌడేపల్లి : మండలానికి చెంది గడ్డం వారి పల్లి పంచాయతీ భక్తలాపురంకు చెందిన గురు శేఖర్ కుమారుడు వెంకట రాజేష్ చౌడేపల్లి ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాడు. అతనికి ఎముకలకు సంబంధించిన వ్యాధి రావడంతో తమిళనాడు రాష్ట్రం చెన్నై నందు చికిత్స చేయించుకుంటున్నాడు. మెరుగైన వైద్యం అందించాలంటే రూ 25 లక్షలు అవుతుందని వైద్యులు నిర్ధారించారు నిరుపేదలైన తమకు అంతటి స్తోమత లేదని తల్లిదండ్రులు బోరున విలపిస్తూ వారి కష్టాన్ని స్థానికులతో పంచుకున్నారు. దీంతో విద్యార్థి ఆరోగ్యం కుదుటపడాలని దాతలు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో బత్తలాపురం కు చెందిన వెంకటేష్ స్థానికంగా విజయవాణి లో దినసురి కూలీగా ఉంటూ విజయవాడకు వెళ్లి అక్కడ స్థిరపడి ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆయన మదిలో వెంకట రాజేష్ కు తన వంతు సాయం చేయాలని అనుకున్నాడు. దీంతో స్థానిక అంబేద్కర్ భవనం నందు తన తల్లిదండ్రులు హనుమప్ప చిన్నక్కల సమక్షంలో వెంకటేష్ ఆయన సతీమణి లక్ష్మి మరియు కుటుంబ సభ్యులు బాధిత వెంకట రాజేష్ తండ్రి గురు శేఖర్ కు రూ 1.10లక్షల రూపాయలు అందించారు. విజయవాడలో ఓ చిరు ఉద్యోగిగా ఉంటూ ఇంతటి ఆర్థిక సాయం చేసినవెంకటేష్ ఆయన కుటుంబాన్ని స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలోఅంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడు బ్యాంకు రెడ్డప్ప గడ్డం వారి పల్లి సర్పంచ్ భాగ్యలత, హరిబాబు ఎంపీటీసీ సభ్యుడు శ్రీరాములు, బత్తలాపురం హరిబాబు, మాల మహానాడు శివకుమార్ దళిత నాయకులు వై శేఖర్ ఆసుపత్రి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.