Oct 15,2023 22:42

ఫొటో : పూజలు చేస్తున్న వైసిపి నాయకులు

హ్యాట్రిక్‌ విజయం కోసం పూజలు
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : కావలి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా మూడోసారి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి నీ ప్రకటించడంతో ఆదివారం కావలి రూరల్‌ వైసిపి నాయకులు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో మండల పరిధిలోని అన్నగారిపాలెం పంచాయతీలో వెలసి ఉన్న శ్రీ ముందర పొట్టమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ
సందర్భంగా కావలి ఎఎంసి చైర్మన్‌ సన్నిబోయిన ప్రసాద్‌, జెడ్‌పిటిసి జంపాని రాఘవులు మాట్లాడుతూ ఇటీవల నెల్లూరులో విపిఆర్‌ కన్వర్షన్‌లో జరిగిన కావలి నియోజక వర్గ సమీక్షా సమావేశంలో రీజనల్‌ కోఆర్డినేటర్‌ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, అధ్యక్షతన కావలి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ముచ్చటగా మూడోసారి మన ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డిని ప్రకటించడం జరిగిందని, అందులో భాగంగానే అమ్మవారికి కుంకుమ పూజ, పాలాభిషేకం, నూటొక్కా టెంకాయలు కొట్టి అమ్మవారికి మొక్కు తీర్చడం జరిగిందని తెలిపారు. మండల పరిధిలోని ప్రతి నాయకుడు కార్యకర్త సమిష్టిగా పనిచేసే మూడోసారి మన ఎంఎల్‌ఎను 35వేల మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల పరిధిలోని సర్పంచులు, ఎంపిటిసిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.