
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: సమాజంలో ఉన్నత స్థితిలో జీవించడానికి హ్యాపీనెస్ కోర్సు అవసరమని ఆర్ట్ ఆఫ్ లీవింగ్ జిల్లా ప్రతినిధి డాక్టర్ కింజరాపు అమ్మన్నాయుడు అన్నారు. నగరంలోని బలగలో ఆదిత్య విద్యానిలయంలో హ్యాపీనెస్ కోర్సు గురువారం ముగిసిన సభలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా అమ్మన్నాయుడు, చిట్టి జనార్థన్‌దాస్ మాట్లాడుతూ నిత్య సాధనతో ఒత్తిడి లేని మనసు, ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చని అన్నారు. డిడిసి సభ్యులు బి.వి.రవిశంకర్ మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రతిఒక్కరూ ఆనందోత్సవ కోర్సు చేయాలన్నారు. అనంతరం అమ్మన్నాయుడు, టీచర్ సురేంద్రలను సన్మానించారు. కార్యక్రమంలో ఆదిత్య విద్యానిలయం ప్రిన్సిపాల్ దేసూళ రమేష్‌బాబు, కరెస్పాండంట్ చిట్టి రాము, చౌదరి శ్రీనివాసరావు, గేదెల ఉమాదేవి పాల్గొన్నారు.