జిల్లా కలెక్టర్ ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం
హస్తకళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ వద్ద ఉన్న ఐఎంఎ హాల్లో ఏర్పాటు చేసిన హస్తకళల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ఆదివారం తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలన్నారు. నిత్యం వినియోగించే అనేక వస్తువులు, లేస్‌తో తయారు చేసిన వివిధ రకాల వస్తువులు ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు. వీటిని ప్రజలు కొనుగోలు చేసి వినియోగించుకోవాలన్నారు. హస్త కళలను ప్రోత్సహించేందుకు వారికి శిక్షణ ఇవ్వడం, బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి జిల్లా జాయింట్ కలెక్టరు ఎం.సూర్యతేజ, ఆర్‌డిఒ దాసి రాజు, డిఆర్‌డిఎ పీడీ వేణుగోపాల్ పాల్గొన్నారు.










