ధర్నా చేస్తున్న నాయకులు
హమాలీల సమస్యలు పరిష్కరించాలని
తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ప్రజాశక్తి-కోవూరు:ఇనమడుగు హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఇనమడుగు సెంటర్ నుంచి కోవూరు బజార్ సెంటర్ మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కోవూరు తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సిఐటియు నెల్లూరు నగరకార్యదర్శి జి.నాగేశ్వరరావు, సిపిఎం కోవూరు మండల కార్యదర్శి గండవరపు శేషయ్యలు మాట్లాడుతూ ఇనమడుగు సెంటర్ హమాలీ కార్మికులు గత నెల రోజుల పై నుంచి సమ్మె చేస్తుంటే యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తున్నదన్నారు.మొండి వైఖరి విడనాడకపోతే పనులు స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఇనుమడుగు సెంటర్ పరిసరాలలోని దళితవాడల్లో నివసించే దళితుల శ్రమను దోచుకుంటున్నారన్నారు.తక్షణమే అధికారులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సిఐటియు నాయకులు పి.సూర్యనారాయణ,సిహెచ్ దామోదర్ రెడ్డి, రాంబాబు, సుధాకర్, ఆవాజ్ నాయకులు చాంద్ బాషా, ఇనమడుగు సెంటర్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.










