Mar 19,2022 23:24

విద్యార్థినుల ఆందోళన


ప్రజాశక్తి - క్యాంపస్‌ :
వీరికి మద్దతుగా భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా గర్ల్స్‌ కన్వీనర్‌ శ్రావణి మాట్లాడుతూ మహిళా వసతి గహం నందు ఎప్పుడు లేని విధంగా సెలవు రోజుల్లో విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతితో కూడా బయటికి వెళ్లకూడదని వారిని నిర్భందిస్తూ వారి పట్ల వివక్ష చూపుతున్నారని, అనేకసార్లు ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్ళినా ఏ మాత్రం అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఉన్నత విద్యాసంస్థలో లింగపరమైన వివక్ష్య కొనసాగడం సరికాదన్నారు. యూనివర్శిటీ స్థాపించిన నాటి నుండి ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు విద్యార్థినులు రక్ష్యణ కొరకు విద్యార్థినులు సెలవురోజుల్లో బయటికి అనుణతించం అని పేర్కొంటున్నారంటే అధికారుల ఆలోచనలో దాగి ఉన్న అర్థం ఏమిటో అర్థం అవుతుందన్నారు. మహిళా వసతి గహంలోని వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ నందు తీవ్రమైన నీటి కొరత, భోజనంలో నాణ్యత లేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతున్నా వార్డెన్లు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఉపకులపతి ఆచార్య రాజారెడ్డి నిరసన ప్రాంతానికి చేరుకోని యధావిధిగా సెలవు రోజుల్లో అనుమతులు ఇచ్చే విధంగా అధికారులుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రవి, ప్రసన్న, ఉరుకుందు శివ, జోసెఫ్‌, శ్రావణ్‌, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.