హెన్రీ డ్యూనాంట్‌కు ఘన నివాళులు
ప్రజాశక్తి-కావలి : రెడ్‌క్రాస్ ఉద్యమస్థాపకులు హెన్రీ డ్యూనాంట్ 123వ వర్థంతి సందర్భంగా సోమవారం రెడ్‌క్రాస్ భవనంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా కావలి రెడ్‌క్రాస్ చైర్మన్ డి రవిప్రకాష్ మాట్లాడుతూ సర్ హెన్రీ డ్యూనాంట్ ఉత్తర ఇటలీలోని సాల్ఫెరెనో అనే ప్రాంతంలో జరిగిన యుద్ధ బాధితులకు, సైనికులకు సేవలందించారని, ఆ స్ఫూర్తితో సాల్ఫెరెనో జ్ఞాపకాలు అనే పుస్తకం వెలువరించారని తెలిపారు. ఐదుగురు స్నేహితులతో రెడ్‌క్రాస్ ఉద్యమానికి నాంది పలికారని పేర్కొన్నారు. 1901 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి నిపొందారన్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి కొత్తవలస వద్ద జరిగిన రైలు ప్రమాద బాధితులకు సకాలంలో సేవలందించిన విజయనగరం, విశాఖపట్నం జిల్లాల రెడ్‌క్రాస్ బృందాలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ బాధ్యులు డి.సుధీర్‌నాయుడు, గంధం ప్రసన్నాంజనేయులు, కలికి శ్రీహరిరెడ్డి, కె.హరినారపరెడ్డి, ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఎ జె మల్లేశ్వరరావు, గంధం రేవతి, విజయలక్ష్మి, పద్మావతి, బిఎస్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.










