Jul 25,2022 22:39

హెల్మెట్‌ తప్పనిసరి
మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులు జైల్‌కు
నిబంధనలు కఠినతరం చేసిన పోలీస్‌శాఖ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

ఇటీవల చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమదాలను దృష్టిలో ఉంచుకొని పోలీస్‌శాఖ ఎంవి యాక్ట్‌ (మోటారు వాహనచట్టం) కఠినతరం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. జిల్లావ్యాప్తంగా హెల్మెట్‌ తప్పనిసరి చేస్తోంది. హెల్మెట్‌ ధరించకుండా వాహనాలు నడిపితే వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు భారీగా జరిమానాలు విధించి దిశగా పోలీసుశాఖ కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇటీవల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగాయి. ఈ ప్రమాదాల్లో యువత మృత్యువాత పడ్డారు. రోడ్డు నిబంధనలు పాటించక హెల్మెట్‌ ధరించకపోవడం మూలంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లుగా పోలీసుశాఖ గుర్తించింది.
ప్రధానంగా రోడ్దుప్రమాదాలు రాష్‌డ్రైవింగ్‌, హెల్మెట్‌ ధరించకపోవడం, రోడ్డు సేప్టీ నిబంధనలు పాటించకపోవడం వల్ల జరుగుతున్నట్ల గుర్తించారు. ముఖ్యంగా యువత పుట్టినరోజుల పేరుతో, పండుగలు, సినీహీరోల పుట్టినరోజులు, జాతరలు వంటి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి సేఫ్టి నిబంధనలు పాటించకుండా వాహనాలు నడపడం ఫలితంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వారం రోజుల వ్యవధిలో చిత్తూరు నగర పరిధిలో ద్విచక్ర వాహన ప్రమాదంలో నలుగురు యువకులు మృతిచెందారు. ఎస్వీసెట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల్లో బిటెక్‌ చదువుతున్న ఓయువకుడు, యువతి హెల్మెట్‌ ధరించకుండా ద్విక్రవాహనంలో ప్రయాణం చేస్తూ దొడ్డిపల్ల రైల్వేబ్రిడ్జి సమీపంలో డివైడర్‌ను ఢకొీన్ని అక్కడిక్కడే మృతి చెందారు. నిన్నటి రోజు ఆదివారం చిత్తూరు కార్పోరేషన్‌ పరిధిలోని 11వ డివిజన్‌ మూడో రైల్వేగేటు ఎం.బండపల్లి వద్ద ఇద్దరు యువకులు మృతిచెందారు. జిల్లాలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో యువత మృతువాత పడ్డారు. నిన్నటి రోజు కర్ణాటక పోలీసులు పూతలపట్టు బికొత్తకోట వద్ద బోలోరో వాహనం డివైడర్‌ను ఢకొీన్న ప్రమాదంలో ట్రైనీ ఎస్‌ఐతో పాటు వాహన డ్రైవర్‌, కానిస్టేబుల్‌ మృతువాత పడ్డారు. మరో ఇద్దరు కానిస్టేబులు తీవ్రగాయాలతో వేలూరు సిఎంసిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
మైనర్లకు వాహనాల్సిస్తే జైలుకే..
వాహనం నడపాలనే సరదా మైనర్ల ప్రాణాలు తీయడంతో పాటు రోడ్లుపై ప్రయాణించే ప్రజలను బెంబేలితిస్తోంది. ఇప్పటివరకు చూసిచూడన్నట్లు వ్యవహరిస్తున్న పోలీసులు ఇకపై ద్విచక్రవాహనాలతో రోడ్లుపై మైనర్లు కనిపిస్తే మైనర్లకు వాహనాల్చిన తల్లిదడ్రులను జైలు పంపనున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లేని మైనర్‌ యువకులు, యువతులు ద్విక్రవాహనాలు నడిపితే వారికి వాహనాలను ఇచ్చిన తల్లిదండ్రులపై కేసునమోదు చేయడం పాటు జైలుకు పంపుతామని పోలీస్‌శాఖ హెచ్చరిస్తోంది. అలాగే భారి జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు ద్విచక్రవాహనాలు ఇవ్వొద్దని పోలీస్‌శాఖ కోరుతోంది.
హెల్మెట్‌ తప్పని సరి
సోమవారం నుండీ అమల్లోకి..
జిల్లా వ్యాప్తంగా ద్విచక్రవాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి. సోమవారం నుంచి మోటర్‌ వైహికల్‌ చట్టాన్ని కఠినతరంగా అమలు చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా హెల్మెట్‌ ధరించని వ్యక్తులపై కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుంది. హెల్మెట్‌ ధరించకుండా వాహనాలు నడుపుతూ పోలీసుల కంటబడితే వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు జైలుకు పంపుతాం. మైనర్లకు ద్విచక్రవాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కేసు నమోదుచేసి వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు తల్లిదండ్రులను జైల్‌కు పంపుతాం. ఇటీవల చోటు చేసుకుంటున్న రోడ్డుప్రమాదాలను దృష్టిలో ఉంచుకోని పోలీస్‌శాఖ కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది. - రిషాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు జిల్లా
మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు:ఎస్‌ఐ
బంగారుపాళ్యం: మైనర్ల ద్విచక్ర వాహనాలు నడిపితే వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు భారీ జరిమానా తల్లిదండ్రులపై కేసు జైలు తప్పదని ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని నాలుగు రోజులు కూడలిలో ద్విచక్ర వాహనాలను నడుపుతున్న మైనర్లను అదుపులో తీసుకుని వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆయన వెంట ఏఎస్‌ఐ మల్లప్ప నాయుడు, పోలీసులు ఉన్నారు.
బైరెడ్డిపల్లి: వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించకుంటే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ వెంకట నరసింహులు హెచ్చరించారు. సోమవారం హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఆపి హెల్మెట్‌ ధరించన తరువాతే ప్రయాణించేలా చర్యలు చేపట్టారు.