ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ హెచ్‌ఐవి వ్యాధి నియంత్రణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని రెడ్‌క్రాస్ సొసైటీ చైర్‌పర్సన్ కాపు భారతి సూచించారు. గురువారం ప్రంచ హెచ్‌ఐవి వ్యాధి నియంత్రన టీకా దినోత్సవ సందర్భంగా నెహ్రూ యువ కేంద్రా అనుబంధ సంస్థలైన ప్రగతి పదం యూత్ అసోసియేషన్, ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్‌ఐవిపై అవగాహనకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్‌ఐవి వ్యాధి రాకుండా అనేక నియంత్రణ చర్యలపై అవగాహన సదస్సులు, అవగాహన కార్యక్రమాలు ప్రజల్లోకి ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, తీసుకెళ్లడం హర్షణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత బిసాటి భరత్, ప్రగతి పథం సంస్థ అధ్యక్షుడు జయ మారుతి, ఎస్‌ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షురాలు దివ్య, రాష్ట్రపతి అవార్డు గ్రహీత జీవన్‌కుమార్, ఆర్ట్స్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ విష్ణు ప్రియ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు నందిత, జోష్ణ, ఆజాం, ప్రదీప్, మహేష్, తుకారం, జి.గౌతందీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఐవి అవగాహన పోస్టర్లను విడుదల చేస్తున్న దృశ్యం










