Aug 10,2023 21:29

భోజనాన్ని పరిశీలిస్తున్న బిసి సంక్షేమ శాఖ డీడీ కుష్బూకొఠారి

         ప్రజాశక్తి-అనంతపురం హాస్టళ్లలో మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని బిసి సంక్షేమ శాఖ డీడీ కుష్బూకొఠారి సూచించారు. గురువారం నగరంలోని బీసీ గర్ల్స్‌ ఫ్రీ మెట్రిక్‌ హాస్టల్‌లో జిల్లాలోని బీసీ హాస్టల్‌ వార్డెన్లు, వర్కర్లకు నూతన మెనూపై, జీఓ 46లోని అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ వంటలు బాగా నాణ్యతగా చేశారని అభినందించారు. అదేవిధంగానే అన్ని బీసీ హాస్టళ్లలో నూతన మెనూను పక్కాగా అమలు చేయాలన్నారు. అదేవిధంగా జీవో 46లోని అన్ని అంశాలపై అవగాహన చేసుకుని అమలు చేయాలన్నారు. అలాగే హాస్టల్లని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం సుభాషిని, తాడిపత్రి ఎబిసి డబ్ల్యూఓ రంగమ్మ, కళ్యాణదుర్గం ఎబిసి డబ్ల్యూఓ గంగాద్రి, బీసీ హాస్టల్‌ వార్డెన్ల సంఘం సీనియర్‌ నాయకులు మస్తాన్‌, జిల్లా అధ్యక్షులు మారుతి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌నాయుడు, కోశాధికారి కంబయ్య, డీడీ కార్యాలయం పర్యవేక్షకులు నాగరత్నమ్మ, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీధర్‌, సిబ్బంది పాల్గొన్నారు