Sep 12,2022 23:27

హార్టికల్చర్‌ కలెక్షన్‌ సెంటర్‌కు భూమిపూజ
ప్రజాశక్తి- శాంతిపురం

మండలంలో దండికుప్పం పంచాయతీలోని చౌడంపల్లి క్రాస్‌ వద్ద సోమవారం హార్టికల్చర్‌ కలెక్షన్‌ సెంటర్‌ భూమిపూజ ఎమ్మెల్సీ భరత్‌ చేపట్టారు. ఈకార్యక్రమానికి ఎమ్మెల్సీ భరత్‌ మాట్లాడుతూ ఈసెంటర్‌ ద్వారా మండలంలోని రైతులందరూ ఈ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఆర్టికల్చర్‌ ఎలక్షన్‌ సెంటర్‌కు రూ.11 లక్షల 50 వేలు ప్రభుత్వం మంజూరు చేశారని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు కార్యక్రమంలో భాగంగా మరసనపల్లి గ్రామంలో రూరల్‌ మార్కెటింగ్‌పై అవగాహన కల్పించారు. ఉద్యానశాఖ అధికారి మధుసూదన్‌రెడ్డి, సహాయ సంచాలకులు కోటేశ్వరరావు, ఉద్యానవన అధికారి డింపు ప్రియా, రైతు భరోసా కేంద్రాధికారి మనోజ్‌ కుమార్‌, స్థానిక ప్రజాప్రతినిధులు రెస్కో మాజీ చైర్మన్‌ చక్రపాణిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విద్యాసాగర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్‌ కుమార్‌, మండల పార్టీ కన్వీనర్‌ బుల్లెట్‌ దండపాణి మురళీమోహన్‌ రెడ్డి, రైతు సంఘం సభ్యులు పాల్గొన్నారు.