- నేషనల్ లెవెల్ ఇండియన్ టాలెంట్
ప్రజాశక్తి-పెనుకొండ : నేషనల్ లెవెల్ ఇండియన్ టాలెంట్ ఒలంపియాడ్ పరీక్షలలో పట్టణంలోని గ్లోబల్ జెన్ పాఠశాల విద్యార్థులు 94 మంది మెడల్స్ సాధించినట్లు బుధవారం పాఠశాల చైర్మన్ యు.శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పాఠశాలకు చెందిన కె. హర్ఫిత్ సాయి 6వ ర్యాంక్,టి. లిఖిలేష్ రెడ్డి - 147వ ర్యాంక్, కె.ధనస్సు - 19 ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. ర్యాంక్ సాధించిన విద్యార్థులను అభినందించి ఇలాంటి విజయాలు సాధించాలని విద్యార్థులను కోరారు.అదేవిధంగా నేషనల్ లెవెల్ లో 94 మెడల్స్ సాధించినందుకు విద్యార్థులను ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మంచివాణి, తదితరులు పాల్గొన్నారు.










