- పట్టించుకోని అధికారులు....
- ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం గుప్పెట్లో విద్యార్థినిలు
- ఆరు నెలల క్రితమే జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళ్లిన ఫలితం శూన్యం...
ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రం అయిన నార్పలలోని స్థానిక దుగుమర్రి రోడ్డులో ఉన్నటువంటి ఎస్సీ బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్ ప్రహరీ గోడ దుగుమర్రి రోడ్డు వైపు కొన్ని చోట్ల కూలిపోయింది అంతేకాక ఉన్న ప్రహరీ గోడ కూడా కేవలం రెండు, మూడు అడుగులే ఉండడం అటువైపే విద్యార్థినిల బాత్రూంలు ఉండడం తో విద్యార్థినీలు కాల కృత్యాలకు వెళ్లాలన్న ఇబ్బందికరంగా మారిందని గతంలో ఈ హాస్టల్ కి ఆనుకొని దుగుమర్రి రోడ్డు వైపు నిరుపేద కుటుంబాలకు చెందిన పలువురు కొట్టాలు వేసుకొని నివసించే వారు వారి నివాస ప్రాంతాల గోడలు ఎత్తుగా అడ్డంగా ఉండేవి దీంతో హాస్టల్లో విద్యార్థినిలు ఎవరు హాస్టల్ లో నుండి రోడ్డులోకి కనిపించే వారు కాదు ఇటీవల కాలంలో దుగ్గుమర్రి రోడ్డులోని ఆక్రమిత స్థలాల్లో ఏర్పాటు చేసిన నివాస స్థలాలను అధికారులు ఖాళీ చేయించి ఇళ్ళు కూల్చివేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా వాటిని కూల్చివేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు దానికి అనుకొని ఉన్న బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహ ప్రహరీ గోడ గురించి కానీ అందులో ఉండే బాలికల రక్షణ గురించి కానీ ఏమాత్రం ఆలోచించలేదు. గతంలో రక్షణ గోడ బాగున్న సమయంలోనే కొందరు అగంతకులు బాలికల హాస్టల్లో చొరబడిన సంఘటనలు ఉన్నాయి. దీనికి తోడు హాస్టల్లో మొత్తం పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో రూముల్లోకి ఎప్పుడు ఏ విష కీటకాలు వస్తాయోనని విద్యార్థినీలు ఆందోళన చెందుతున్నారు అని గత ఆరు నెలల కిందటే స్థానిక అధికారులు జిల్లా ఉన్నతాధికారులతో పాటు అప్పటి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి నార్పల ప్రభుత్వ బాలుల పాఠశాల సందర్శనకు వచ్చిన సమయంలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లిన ఫలితం శూన్యమని విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చి పాఠశాలలు పునర్ ప్రారంభమైన పట్టించుకునే నాధుడే కరువయ్యారని పలువురు విద్యార్థినీయుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా, ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు స్పందించి వసతి గృహంలో ఉండే విద్యార్థినిల ఇబ్బందిని గుర్తించి వెంటనే హాస్టల్ ప్రహరీ గోడను నిర్మించడంతోపాటు హాస్టల్లోపల పెరిగిన పిచ్చి మొక్కలను కూడా తొలగించి విద్యార్థులను విషకాటికాల భారీ నుండి తప్పించాలని పలువురు హాస్టల్లో ఉండే విద్యార్థుల తల్లిదండ్రుల తో పాటు స్థానికులు కోరుతున్నారు.










