May 24,2023 15:43

ప్రజాశక్తి-ఓబులదేవర చెరువు : మండల పరిధిలోని మిట్టపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటిమడుగులో పడి ఆఫ్రిన్ 16 ఏళ్ల బాలిక మృత్యువాత పడింది. పెద్దగుట్లపల్లి గ్రామానికి చెందిన రాజు సాబ్ ఇమాంబి బతుకుదెరువు కోసం బెంగళూరులో నివాసం ఉంటున్నారు. రాజు సాబ్ సోదరుడు బాబాసాహెబ్ ఇంట్లో దైవ కార్యక్రమము ఉండడంతో రాజు కుటుంబ సమేతంగా మిట్టపల్లి విచ్చేశారు. నిన్నటి రోజున అనంతపురం జిల్లా నార్పల మండలం గుగుడు కుళ్లాయ స్వామిని దర్శించుకుని వచ్చారు. నిన్నంతా ప్రయాణాల్లో అలసిపోయామని ఈరోజు విశ్రాంతి తీసుకుందామని ఇంటి వద్ద ఉండగా రాజు సాబ్ కుమార్తె అఫ్రీన్ తోటి పిల్లలతో కలిసి సోమావతి నది ఒడ్డున ఉన్న ఆలయం వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిమడుగులో పడిపోయింది. గుర్తించిన పిల్లలు గ్రామస్తులకు సమాచారం చేరవేయడంతో హుటాహుటిన గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే బాలిక నీటిలో మునిగిపోవడంతో తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

  • మృతురాలు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

మిట్టపల్లిలో జరిగిన సంఘటన తెలుసుకొని  మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అక్కడికి చేరుకొని మృతదేహాన్ని నివాళులర్పించి మృతురాలు  కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వారి కుటుంబాన్ని కొండంత ధైర్యం ఇచ్చి నేనున్నానని భరోసా ఇచ్చారు.