Jun 24,2023 11:02
  • నార్పల మండలంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు సరే...

ప్రజాశక్తి-నార్పల : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని 2006 బాల్య వివాహ చట్టం ప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు వయసు నిండుతేనే వివాహం చేయాలి. అలా కాకుండా చట్టానికి విరుద్ధంగా ఎవరైనా వివాహాలు చేస్తే అటువంటి వారికి పది నుండి 20 సంవత్సరాలు జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా మండలంలో బాల్య వివాహాల నివారణ కొరకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలోనూ, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు శాఖ ఆధ్వర్యంలో విరివిగా అవగాహన సదస్సులు నిర్వహించి బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే అనర్ధాలను వివరిస్తున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా బాల్య వివాహాల నివారణ కొరకు అవగాహన కల్పించే అధికారులు ప్రజా ప్రతినిధులు నార్పల మండలంలో స్థానిక బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలకు వెళ్లి చదువుకునే బాలికలకు రక్షణ కరువైంది. ముఖ్యంగా నార్పల బాలికల పాఠశాల గ్రామానికి దూరంగా ఎంపీడీవో కార్యాలయ సమీపంలో ఉందని బాలికల పాఠశాలకు వెళ్లే బాలికలు సుమారు ఒక కిలోమీటర్ మేర గూగుడు రోడ్డులో నడుచుకుంటూనో, సైకిల్ లోను వెళ్తుంటారు పాఠశాలకు విద్యార్థినీలు వెళ్లే సమయంలోను, వచ్చే సమయంలోను స్థానిక గూగూడు రోడ్డు లో  కొందరు ఆకతాయిలు విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల దృష్టికి కూడా తీసుకొని వెళ్లారు. దీనిపైన స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు  మండల సర్వసభ్య సమావేశంలో మండల విద్యాధికారి కృష్ణయ్య తెలిపారు పాఠశాలకు వెళ్లే సమయంలో వచ్చే సమయంలో వేధింపుల గురించి గ్రామాల నుండి వచ్చే విద్యార్థినిలు ఇండ్లలో చెప్పలేక తమలో తాము కూలిపోతున్నారని వేధింపులు మితిమీరినప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులు భయపడి మీరు చదివిన చదువులు ఇక చాల్లే అంటూ వివాహాలు చేస్తున్నారు. దీంతో నార్పలలో చదువుకునే విద్యార్థినిలు పరిస్థితి కక్కలేక మింగలేక అన్న విధంగా మారింది. ముఖ్యంగా ఈ వేధింపులు అధికం కావడంతో తల్లిదండ్రుల భయమే బాల్య వివాహాలకు కారణమవుతోందని వీటిని ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లోనూ టీవీలలో విద్యార్థినీయులపై ఆకతాయిల దాడులు తదితర వాటికి భయాందోళనకు లోనవుతున్న గ్రామీణ ప్రాంతల విద్యార్థుల తల్లిదండ్రులు బాలికలకు 14 నుండి 15 సంవత్సరాలు రాగానే వివాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా నార్పల్లో చదువుకునే విద్యార్థినిలకు ఆకతాయిల వేధింపులు లేకుండా రక్షణ కల్పించి ఆకతయిలపై కఠిన చర్యలు తీసుకుంటే విద్యార్థినీయుల తల్లిదండ్రుల్లో ధైర్యం వచ్చి బాల్య వివాహాలు తగ్గిపోతాయని చదువుకునే విద్యార్థినిలకు రక్షణ కల్పించ లేనప్పుడు బాల్య వివాహాలపై ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించిన నిరుపయోగమే అని పలువురు  స్థానికులు అంటున్నారు.