ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంగం వారి పల్లి నందు తల్లిదండ్రుల సమావేశంలో ఆదర్శ పాఠశాలకు ఎంపికైన ఎనిమిది మంది విద్యార్థులకు గ్రామపంచాయతీ సర్పంచ్ రవిచంద్రబాబు, పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీనివాసులు వైస్ చైర్మన్ సతీష్ మునిరత్నమ్మ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రా నాయక్ వీరి ఆధ్వర్యంలో ఏపీ మోడల్ స్కూల్ సెలెక్ట్ విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసి విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు.
ఆదర్శ పాఠశాలకు ఎంపికైన విద్యార్థుల వివరాలు :
భవ్య శ్రీ, హరీష్, హర్షిత, తేజేష్, చరణ్, యశ్వంత్, చరణ్ తేజ్, మహాలక్ష్మి
ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు ఉపాధ్యాయుల కృషిని వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఝాన్సీ రాణి, రవి, శశికుమార్ ,నాగరాణి రెడ్డమ్మ గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.










